Amaravathi Stories - My take

అమరావతి కధలు - నా చిరు ప్రయత్నం.
కధలని మొదట రాసిన సత్యం గారికి ....

Amaravathi is a laid back village situated on the banks of River Krishna. A devotional center, a huge Amareswara Swami temple, situated on the banks of the river Krishna is the main attraction, drawing devotees all round the year. Amaravathi also used be a renowned Buddhist center in the past with Acharya Nagarjuna said to have lived here.

మహా మంచోడు సాంబడు.
అవ్వడానికి చెప్పులు కుట్టే వాడు అయినా గుణం లో మాత్రం సత్ బ్రాహ్మణుడి కన్నా మంచి వాడు.
చెప్పుల కొట్టు పెట్టుకున్నాడు.
తెలిసిన వారిని తన shop కి పిలిచి అభిమానం గా చూసే వాడు. తన మన అందరిని సొంత అప్ప చెల్లలు గా అన్న తమ్ములు గా చుస్కునే వాడు సాంబడు. కృష్ణమ్మ అంటే మహా ఇష్టం. రోజు స్నానం చేసి అమరేశ్వరుడి కి దణ్ణం పెట్టందే మనసు ఊరుకోదు వాడికి.


ప్రకృతి కి కొంచం తిక్క ఉంది. 
ఇంత మంచి సాంబడి కి రోగం తెప్పించింది. కష్టపడి కొట్టు పెట్టుకున్నాడు. బోలెడు అప్పులు. 
రోగం ముదిరింది. ఇక అయిపొయింది అని పెదవి విరిచారు డాక్టర్లు. 


నిజం గా అయిపొయింది. సాంబడు వెళ్ళిపోయాడు.
ప్రకృతి తీస్కెల్లిపోయింది. మహా ఇష్టం దానికి మంచోళ్ళు అంటే.
పోతూ పోతూ ఒక చిట్టా రాసి పెట్టాడు. తన కి అప్పు ఉన్న 14  లక్షల వివరాలు. అదే చిట్టా వెనక తన కి రావాల్సిన 14 లక్షల వివరాలు కూడా రాసి పెట్టి పోయాడు. ఇంకొకళ్ళు ఇబ్బంది పడడం చూడలేదు వాడు. మంచోడు సాంబడు.


ఇంత మంచోడ్ని తీస్కెల్లిపోయనే అని ప్రకృతి బాధ పడింది. తన కళ్ళ లోంచి నీళ్ళు ఆగ లేదు. కృష్ణమ్మా తట్టుకోలేక పోయింది. ఆ బాధ తో ఉప్పొంగింది.
సాంబడు చనిపోయిన రోజు న మొదలైన వర్షం తెరపి లేకుండా పడుతూనే ఉంది. సాంబడి ని కాల్చాలి. అమరావతి చుట్టూ కట్టెలు లేవు. అన్ని వర్షం  దెబ్బకి తడిసిపోయాయి. స్మశానాని కి తీస్కు పోదాం అని చూస్తే, కృష్ణమ్మపొంగింది. పోనివ్వట్లేదు సాంబడి ని. స్మశానం చుట్టూ నీళ్ళు. నడవను దారి లేదాయే.
ఒక చిన్న చేపల డింకి తెప్పించారు. పడవ లో స్మశానానికి తీస్కోని వెళ్లారు. కాల్చడానికి కట్టెలు లేవాయే. ఒక 4 -5 లారీ టయర్ లు తెప్పించారు. దాంతో కాల్చారు సాంబడి ని. 


వర్షం తగ్గలేదు. ప్రకృతి బాధా ఆగలేదు. కృష్ణమ్మా తగ్గలేదు. ఇంత వరద గత 50 ఏళ్ళ లో రాలేదు. మూడవ రోజు అస్థికలు తీసి కృష్ణ లో కలుపుదామని వెళ్లారు అందరు. 


వెళ్లి చూస్తే స్మశానమే లేదు. స్మశానాన్ని కూడా కలిపేసుకుంది కృష్ణమ్మ. నా బిడ్డ అస్థికలని మీరు నాలో కలిపేది ఏంటి, నేనే వచ్చి కలుపుకు పోతాను అనుకుందో ఏమో, వచ్చింది, స్మశానాన్ని ముంచెత్తి తన బిడ్డ ని కలుపుకు వెళ్ళింది. 
అలా వెళ్లిందో లేదో. వర్షం ఆగింది, కృష్ణమ్మవరద తగ్గింది. ఊరు మళ్ళి ప్రశాంతం గా ఉంది. 


కాని ఏదో లోటు. అప్యాయం గా పలకరించడానికి సాంబడు లేదు. సాంబడి చెప్పుల కొట్టు లేదు. కృష్ణమ్మ కి కొడుకు లేదు.



Comments

  1. heart felt rendition, yet short and sweet.. just curious is this is real story of cheppula Sambayya uncle who was a very good man...
    nice Sai keep going.. vaddamnanu tattaya must be proud..

    ReplyDelete
  2. Partly I would say. Heard bits and pieces from amma and Jayaram mama. Put it together and added my flavor.
    Glad that you liked it :)

    ReplyDelete
  3. Follow the blog if you want to read more of my writings

    ReplyDelete
  4. Having read this story reminds me of sambaiah his caring and cheerful nature. He was there for me taking care of my father and mother when I was away in service. He was truly the best human being and friend that one could wish for. He taught me a lot about life. I truly cherish my days of B.Com with him. May his legacy be carried on by his children and I pray for him and his family. Thanks you sai Krishna for sharing this post.

    -Vaddamanu Nageswara Rao

    ReplyDelete

Post a Comment